సుప్రీం తీర్పుకు కట్టుబడి నడుచుకుంటా: గౌరు
కర్నూలు: సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి వ్యవహరిస్తానని కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఆయన తన స్వగ్రామంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఒక భారత పౌరునిగా సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి నడుచుకుంటానని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాను ఔదల దాలుస్తానని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తాను రాష్ట్ర డిజిపికి ఒక లేఖ రాశానని, తాను ఎల్లవేళలా అందుబాటులో వుంటానని, లొంగిపోవాలంటే లొంగిపోతానని చెప్పానని ఆయన అన్నారు. అయితే దానికి ఒక పద్ధతి ఉంటుందని, పద్ధతి ప్రకారం తనకు కోర్టు నుంచి వారంట్ రావాలని ఆయన అన్నారు. తాను లొంగిపోయే ముందు మీడియా ప్రతినిధులందరికీ చెప్పి వెళ్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications