వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రిలో సితార విద్వాంసుడు రవిశంకర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సాన్‌డీగో: ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ సాన్‌డీగోలోని ఒక ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. రవిశంకర్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని వారన్నారు. భార్య సుకన్య ఆయన పక్కనే ఉందని కాలిఫోర్నియాలోని ఎన్సినాటిలో గల రవిశంకర్‌ ఫౌండేషన్‌లో పనిచేస్తున్న జెన్నిఫర్‌ పిటిఐ వార్తాసంస్థ ప్రతినిధితో చెప్పారు. రవిశంకర్‌ ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే విషయాన్ని వెల్లడించడానికి ఆమె నిరాకరించారు.

రవిశంకర్‌ భార్య ఫోన్‌ నెంబర్‌ ఇవ్వడానికి కూడా ఆమె నిరాకరించారు. రవిశంకర్‌ భార్య వ్యక్తిగతమైన కాల్స్‌ను తీసుకోవడం లేదని ఆమె అన్నారు. రవిశంకర్‌కు సంభవించిన అస్వస్థత వివరాలను కూడా ఆమె అందించడానికి ఇష్టపడలేదు. సాధారణమైన చెక్‌ అప్‌ కోసం రవిశంకర్‌ ఆస్పత్రికి వెళ్లారని కోల్‌కత్తాలోని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. రవిశంకర్‌ వయస్సు ప్రస్తుతం 86 ఏళ్లు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X