గౌరూ! వెంటనే లొంగిపో!!: సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డిని ఆదేశించింది. గౌరు చరితారెడ్డికి ప్రసాదించిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. గౌరు వెంకటరెడ్డి పెట్టుకున్న పిటిషన్‌పై ప్రతిస్పందిస్తూ సుప్రీంకోర్టు మంగళవారంనాడు ఆ ఆదేశాలు జారీ చేసింది. గౌరు వెంకటరెడ్డి అభ్యర్థలను అన్నింటినీ సుప్రీకోర్టు తోసిపుచ్చింది.
తీర్పులో తాను లొంగిపోవాలా, వద్దా అనే విషయాన్ని స్పష్టం చేయలేదని, దానిపై వివరణ ఇవ్వాలని గౌరు వెంకటరెడ్డి సుప్రీంకోర్టును కోరారు. కొద్ది రోజులు వెలుపల ఉండడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. లొంగిపోయేందుకు గడువు ఇవ్వాలని, క్షమాభిక్షపై పునఃపరిశీలనకు గడువు ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. తక్షణమే గౌరు వెంకటరెడ్డి పోలీసులకు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోకపోతే పరిణామాలు ఎలా వుంటాయో మీకు తెలుసునని గౌరు వెంకటరెడ్డి తరఫు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు.












Click it and Unblock the Notifications