దమ్ముంటే సొరాబ్జిపై ఫిర్యాదు చేయండి: టిడిపి
హైదరాబాద్: దమ్ముంటే మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం.వి. మైసురారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించకుండా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం విడ్డూరమని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారన్నారు. ప్రభుత్వానిది తప్పుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వారన్నారు.
రాజీనామా చేయాలా, వద్దా అనేది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన విషయమని, అయితే నైతిక విలువలుంటే రాజీనామా చేయక తప్పదని వారన్నారు. రాజశేఖర రెడ్డికి నైతిక విలువలు లేవనే విషయాన్ని తాము ప్రజల్లోకి తీసికెళ్తామని వారు చెప్పారు. ఎంత సేపూ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారని వారన్నారు.












Click it and Unblock the Notifications