ఏ మాజీ సియంకూ ఇంత భద్రత లేదు: జెసి
విజయవాడ: ఏ మాజీ ముఖ్యమంత్రికీ కల్పించనంతటి భద్రత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కల్పించారని, అయినా చాలదంటే ఏమీ మాట్లాడదలుచుకోలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడుకు ఇప్పటికే 153 మందితో భద్రత కల్పించారని, ఇంకా కావాలనడం ఏమిటని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సెక్యూరిటీ పోలీసులు వెంట ఉండడం సంఘంలో హోదాగా మారిందని, హోదా కోసం గన్‌మెన్‌ను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కొంత మందికైతే ఎంత మంది ఎక్కువగా వుంటే అంత హోదా అన్నట్లు ఉందని ఆయన అన్నారు. నారా చంద్రబాబునాయుడుకు భద్రత తగ్గించారనే విమర్శపై ఆయన ఆ విధంగా అన్నారు. స్థానిక సంస్థలకు విధులు బదలాయిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications