వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రదర్శనల తీరుకు చంద్రబాబు విచారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు, గౌరు వెంకటరెడ్డి క్షమాభిక్ష వ్యవహారాల్లో తమ పార్టీ ప్రదర్శనల తీరుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రదర్శనలకు కూడా కుల, మతాలు అంటగట్టడం దురదృష్టకరమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దళితుడికి ముఖ్యమంత్రి వేషం వేసి ప్రదర్శన నిర్వహించినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఏ నిబంధనలు, షరతులు లేకుండా ఆ ఆర్థిక సంస్థ కూడా నిధులు ఇవ్వదని ఆయన అన్నారు. తమపై గతంలో చేసిన ప్రచారానికి కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ప్రపంచబ్యాంకుపై రుణాల విషయంలో గతంలో తమను విమర్శించిన కాంగ్రెస్‌వారు ఇప్పుడేం చెబుతారని ఆయన అడిగారు. ఆ ఆర్థిక సహాయ సంస్థనైనా షరతులు లేకుండా రుణం ఇవ్వబోదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X