కడప తప్ప వైయస్‌కేదీ పట్టదు: దత్తాత్రేయ
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కడప అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత బండారు దత్తాత్రేయ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన మంగళవారం మీడియా ప్రతనిధుల సమావేశంలో 11 ప్రశ్నలను సంధించారు. తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు.
నిజామాబాద్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏ విధమైన సౌకర్యాలు కల్పించలేదని ఆయన విమర్శించారు. నిధులు కూడా ఆ యూనివర్శిటీకి పెద్దగా కేటాయించలేదని ఆయన అన్నారు. వేమన విశ్వవిద్యాలయానికి మాత్రం అన్ని హంగులూ సమకూర్చారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఆలపిస్తున్న అభివృద్ధి తారక మంత్రం ఇదేనా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications