షరతులు లేని రుణం బూటకం: సిపియం
హైదరాబాద్: షరతులు లేకుండా రాష్ట్రానికి రుణాలు ఇస్తామని ప్రపంచబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ గ్రామ్ వీలర్ చేసిన ప్రకటన వట్టి బూటకమని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ప్రపంచ బ్యాంక్‌తో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసుకున్న తాజా ఒప్పందం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రపంచబ్యాంకుతో వైయస్ ప్రభుత్వం నాలుగు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన చెప్పారు. ప్రపంచబ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలను అన్నింటినీ ప్రజల ముందుంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications