రాష్ట్రంలో డెంగీ కేసులున్నాయి: మంత్రి రోశయ్య
వరంగల్: రాష్ట్రంలో డెంగీ కేసులున్నాయని, కొందరు దాని వల్ల చనిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్య అంగీకరించారు. రెండు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన మంగళవారంనాడు డెంగీ, చికన్ గన్యా వ్యాధుల నివారణా చర్యలపై సమీక్ష జరిపారు. ఈ వ్యాధుల నివారణకు నిధుల కొరత, మందుల కొరత లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
డెంగీ, చికన్ గన్యా వ్యాధుల నివారణకు గిరిజన ప్రాంతాల్లో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్యుల కొరత వున్నదని ఆయన చెప్పారు. డెంగీ వ్యాధి నిరోధానికి తమ వద్ద కంటిజెన్సీ నిధులు మాత్రమే అందుబాటులో వున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్బుమణి రాందాస్ చెప్పారని, అయితే ప్రధానితో మాట్లాడి మరిన్ని నిధులు ఇచ్చేందుకు సహాయపడతానని రాందాస్ చెప్పారని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications