గుత్ప ఎత్తిపోతల కాంట్రాక్టర్‌కు జరిమానా
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని గుత్ప ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. పథకం నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు కోటి రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లుల్లోంచి మినహాయించుకుంటారు.
కాంట్రాక్టర్‌కు మరింత జరిమానా విధించేందుకు కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి ఈ ఏడాది ఖరీఫ్ నాటికి నీరు విడుదల చేయాల్సి వుంది. అయితే వచ్చే ఏడాది రబీ నాటికి కూడా నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం కాంట్రాక్టర్‌పై కన్నెర్ర చేసింది.












Click it and Unblock the Notifications