రాష్ట్రంలో డెంగీ లేనే లేదు: పనబాక లక్ష్మి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో డెంగీ వ్యాధి సూచనలు ఏవీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలినట్లు తమకు ఏ విధమైన వివరాలు అందలేదని ఆమె అన్నారు. విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంగళవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ప్రబలినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో డెంగీ వ్యాధి లేదని ఆమె అన్నారు.
అయితే రాష్ట్రంలో చికన్ గన్యా కాస్తా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమేనని ఆమె అన్నారు. డెంగీ గానీ చికన్ గన్యా గానీ పారిశుధ్య పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల వస్తాయని, అందువల్ల ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం వుందని ఆమె అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మీడియా ద్వారా తాము కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications