గవర్నర్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్న యస్‌యఫ్‌ఐ విద్యార్థులు

శ్రీకాకుళం: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గవర్నర్‌ రామేశ్వర ఠాకూర్‌ కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి భారత విద్యార్థి సమాఖ్య (యస్‌యఫ్‌ఐ) కార్యకర్తలు మంగళవారంనాడు తీవ్ర ప్రయత్నం చేశారు. యస్‌యఫ్‌ఐ కార్యకర్తలు గవర్నర్‌ కాన్వాయ్‌కి అడ్డం పడ్డారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాలను ముట్టడించాలని యస్‌యఫ్‌ఐ ముందే నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళంలో యస్‌యఫ్‌ఐ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సమయంలో శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన గవర్నర్‌ వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితితో గవర్నర్‌ కాన్వాయ్‌కి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+