తెలంగాణకు సోనియా కట్టుబడి వున్నారు: ఎమ్మెస్సార్
కరీంనగర్: తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడానికి కట్టుబడి వున్నారని క్రీడలు, స్కాృంతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణరావు చెప్పారు. తెలంగాణ విషయంలో సోనియా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు వామపక్షాలు వ్యతిరేకంగా వున్నాయని, వాటిని ఒప్పించడానికి సోనియా ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం వల్ల ఒత్తిడి తేలేకపోతున్నామని, ఒకే పార్టీ పాలన వుంటే ఒత్తిడి చేయడానికి అవకాశం వుండేదని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియా సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీతోనూ ప్రధాని మన్మోహన్ సింగ్‌తోనూ మాట్లాడారని ఆయన చెప్పారు. వామపక్షాలను ఒప్పించడానికి సోనియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications