సాగునీటి ప్రాజెక్టుల గతీ అంతే: ఉప్పునూతల
హైదరాబాద్: ఫ్లై ఓవర్ గతే సాగునీటి ప్రాజెక్టులకు పట్టే ప్రమాదం ఉందని సీనియర్ కాంగ్రెసు నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని పంజగుట్ట ఫ్లై ఓవర్ కూలిన సంఘటనపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎన్నో లోపాలు జరుగుతున్నాయని, ఇది దాచేస్తే దాగదని ఆయన అన్నారు. ఫ్లై ఓవర్ కూలిన ఘటన కేవలం మరణాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదని, ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కూడా అని ఆయన అన్నారు.
ఏమిటి ఈ నాసిరకం పనులని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరుగుతోందనే విషయంపై అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారని, అందులో నిజం కూడా ఉందని, పనులను కాంట్రాక్టరుకు ఇవ్వడం, ఆ కాంట్రాక్టరు సబ్ కాంట్రాక్టరుకు అప్పగించడం జరుగుతోందని, దీని వల్ల ఎవరికి అందాల్సిన కమీషన్లు వారికి అందుతాయని ఆయన అన్నారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications