వర్షంలో సాగుతున్న నిమజ్జన కార్యక్రమం
హైదరాబాద్: రాజధానిలో వినాయక నిమజ్జనం మొదటి దశ కార్యక్రమం మొదలైంది. వినాయక చవితి తర్వాత నిన్నటికి ఐదురోజులు కావడంతో రాత్రి నుంచి నగర శివారులో ఉన్న విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు.
ఎడతెగని వర్షం కారణంగా నిమజ్జన కార్యక్రమం ఆలస్యంగా సాగుతోంది.ఇటీవలి పేలుళ్ళ నేపధ్యంలో పోలీసులు ట్యాంక్ బండ్ పై భారీ బందోస్తు చేశారు. దాదాపు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో దాదాపు 45 వేల వినాయక విగ్రహాలను పెట్టగా, ఇప్పటివరకు 15 వేల విగ్రహాలను నిమజ్జనం చేసి ఉంటారని అధికారుల అంచనా.












Click it and Unblock the Notifications