అర్హులైనవారందరికీ ఇళ్లు: కావలిలో వైయస్
నెల్లూరు: వచ్చే ఏడాదికల్లా అర్హులైనవారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఇల్లు లేనివారంటూ రాష్ట్రంలో ఉండకూడదని ఆయన అన్నారు. తాను అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. ఇందిరమ్మ సంబరాలను ఆయన శుక్రవారం నెల్లూరు జిల్లా కావలిలో ప్రారంభించారు.
వచ్చే నెలలో ఇందిరమ్మ గృహాల ప్రవేశం జరుగుతుందని ఆయన చెప్పారు. మొదటి విడత 86 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇందులో 50 - 56 వేల ఇళ్లకు సంబంధించి వచ్చే నెలలో గృహప్రవేశాలు జరుగుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications