మత్తు ఇచ్చి దోపిడీ చేసిన మాయలేడి
వరంగల్: మత్తు పదార్థాలు ఇచ్చి మహిళలను ఒక మాయ లేడి నిలుపుదోపిడీ చేసిన సంఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ఓబుళాపురం గ్రామంలో జరిగింది. గ్రామంలోని దర్గా వద్దకు ఒక మహిళ వచ్చి తనకు సంతానం కలగజేయాలని ప్రార్థించడానికి వచ్చానని ఆ మహిళ తోటి భక్తురాళ్లకు చెప్పింది. ప్రసాదమంటూ వారికి స్వీట్లు పంచింది. అవి తిన్న మహిళలు మత్తులోకి జారిపోయారు.
మత్తులోకి జారిన మహిళలు పది గంటల వరకు స్పృహలోకి రాలేదు. స్పృహలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే తమ తమ మెడల్లోని మంగళసూత్రాలతో సహా అన్నీ మాయమయ్యాయి. ఆ మహిళ కనిపించలేదు. పైగా మత్తు పదార్థాలు తిన్న ఆరుగురు మహిళలకు వాంతులు వచ్చాయి. దీంతో వారిని వరంగల్లులోని ఎంజిఎం ఆస్పత్రిలో చేర్చారు. తాను ఒక పోలీసు అధికారి భార్యనని, ఆ మహిళ నల్లగా ఉంటుందని బాధితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications