చర్లపల్లి జైలుకు బంగ్లాదేశ్ యువకుడు రిద్వాన్
హైదరాబాద్: హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో అనుమానితుడు బంగ్లాదేశ్ యువకుడు రిద్వాన్ ఘాజీని పోలీసులు శుక్రవారంనాడు నాంపల్లి కోర్టు హాజరుపరిచారు. రిద్వాన్ ను పోలీసులు ఇటీవల బెంగుళూరులో అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. గడువు ముగిసినా హైదరాబాదులోనే నివాసం ఉండడంపై రిద్వాన్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
రిద్వాన్ కు వచ్చే నెల 5వ తేదీ వరకు జ్యుడిష్యల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిద్వాన్ ను పోలీసులు హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు. హైదరాబాద్ పేలుళ్లతో తనకు సంబంధం లేదని రిద్వాన్ అన్నాడు. చదువు కోసమే తాను హైదరాబాద్ వచ్చానని చెప్పాడు.












Click it and Unblock the Notifications