ప్రశాంత్ కేసులో నేను అమాయకుడ్ని: వెంకట్
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో తాను అమాయకుడినని పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు వెంకట్ అన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తాను హత్య చేయలేదని తేలిపోయిందని ఆయన అన్నారు.
చికిత్స నిమిత్తం వెంకట్ ను పోలీసులు శుక్రవారంనాడు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తనకు చాలా ఆనందంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను వంద శాతం అమాయకుడినని ఆయన అన్నారు. తాను ఇంకా ఏమీ చెప్పదలుచుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications