పవన్, నందినిల కేసుల విచారణ వాయిదా
విశాఖపట్నం: సినీ నటుడు పవన్ కళ్యాణ్, నందినిల విడాకులు, మనోవర్తి కేసుల విచారణ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ వేసిన విడాకుల కేసుపై, నందిని వేసిన మనోవర్తి కేసుపై శుక్రవారం రహస్య విచారణ జరిగింది. విచారణ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.
ఇరు పక్షాల న్యాయవాదులను న్యాయమూర్తి తన ఛేంబరులోకి పిలిపించి విచారణ జరిపారు. నందిని తరఫు న్యాయవాది కౌంటరు దాఖలు చేయలేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తరఫు న్యాయవాది మాత్రం కౌంటర్ దాఖలు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండా రేణూ దేశాయిని పవన్ పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ నందిని కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడాకులు కోరుతూ పవన్ కళ్యాణ్ కేసు వేశారు.












Click it and Unblock the Notifications