అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తా: రోజా
పామర్రు: పార్టీ అధిష్ఠాన వర్గం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీనటి రోజా చెప్పారు. పామర్రులో ఆమె శుక్రవారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ నాయకత్వం కోరితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఆమె అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. డ్వాక్రా మహిళలకు సాయం అందిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె అవహేళన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు డబ్బులు కొంగులో ముడి వేసుకునేవారని, ఇప్పుడు ముడివేసుకోవడానికి కూడా పేద మహిళల వద్ద డబ్బులు లేవని ఆమె అన్నారు. కాంగ్రెస్ మంత్రుల, పెద్దల కుటుంబాలకు చెందిన మహిళలు తమ కొంగుల్లో నోట్ల కట్టలు ముడివేసుకుంటున్నారేమో తెలియదని, సామాన్య స్త్రీలకు మాత్రం ఏమీ దక్కడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications