పసిపిల్లలపై ఇంత హింసా..? బాత్ రూమ్ లో బంధించి.. స్ప్రే కొట్టి.. ఏడుస్తున్నా..
అభంశుభం తెలియని పసి పిల్లలపై దారుణానికి ఒడిగట్టారు. చిన్నారులను వాషింగ్ మెషన్ లో పెట్టి టాయిలెట్ జెట్ తో స్ప్రే చేసి బాత్ రూమ్ లో ఉంచి తాళం వేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటన బెంగళూరులోని కేప్ జెమిని క్యాంపస్ లోని డే కేర్ సెంటర్ లో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు మహిళలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
మొదట సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. డే కేర్ సెంటర్ లో ఉన్న కేర్ గీవర్స్ అక్కడున్న 2 నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్లలను బలవంతంగా ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ పై ఉంచారు. అలాగే పసి పిల్లల నోటిలో స్ప్రే కొట్టారు. పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్న క్రమంలో బాత్ రూమ్ లో పెట్టి లాక్ వేశారు.

పిల్లలు అంతా 2 నుంచి 3 ఏళ్ల వయసు వారే ఉన్నారు. చిన్నారులను డే కేర్ సెంటర్ లో వేసి వారి పేరెంట్స్ వర్క్ కు వెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వారి స్టేట్ మెంట్స్ ను పోలీసులు ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని ఆధారాల కోసం చూస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటన కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ వద్దకు కూడా వెళ్లింది. ప్రస్తుతం ఈ సంస్థ కూడా విచారణ జరుపుతోంది. ఈ మేరకు అధికారుల నుంచి రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ డే కేర్ సెంటర్ ను కేప్ జెమిని సంస్థకు చెందినదా..? లేక ఇతర వాళ్లదా..? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications