ఎమ్మెల్యే చెంగల రాజీనామా నిర్ణయం
విశాఖపట్నం: రైవాడ ముఠా ఆనకట్ట నిర్మాణంలో అవినీతిపై ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించకోనందున తాను రాజీనామా చేయనున్నట్లు పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చెంగల వెంకటరావు చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఫాక్స్ ద్వారా పంపుతానని ఆయన బుధవారం మీడియా ప్రతినిధలతో చెప్పారు.
శాసనసభ్యుడి రాజీనామా నిర్ణయాన్ని కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. రాజీనామా చేయవద్దని శాసనసభ్యుడిని కోరుతున్నారు. చెంగల వెంకట్రావు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిళా కార్యకర్త ఒకరు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది.












Click it and Unblock the Notifications