గోదాములపై సిపిఐ కార్యకర్తల దాడులు
హైదరాబాద్: అధిక ధరలకు నిరసనగా సిపిఐ కార్యకర్తలు బుధవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా గోదాములపై దాడులు నిర్వహించారు. హైదరాబాదులోని నాగార్జునసాగర్ రోడ్డులో గల పోస్టర్ కోల్డ్ స్టోరేజీ అనే ప్రైవేట్ గోదాముపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడి సమయంలో గోదాము యజమానికి, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. గోదాములో పప్పు ధాన్యాలను, ఎండు మిర్చిని, చింతపండును ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు.
నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా నారాయణ విమర్శించారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలోని గోదాముల్లో ఉన్న సరుకులను వెలికి తీయకపోతే ధరలు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు. ధరలను తగ్గించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. అనంతపురంలో గోదాముపై దాడి చేసిన సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications