చిరంజీవి కూతురని తెలియదు: పురోహితుడు
హైదరాబాద్: పెళ్లి చేసినప్పుడు శ్రీజ మెగాస్టార్ చిరంజీవి కూతురని తెలియదని ఆమెతో శిరీష్ భరద్వాజ్ పెళ్లి చేసిన పురోహితుడు పండిత లింగమాచారి తెలిపారు. తనకు పెళ్లి అయిన తర్వాత శ్రీజ చిరంజీవి కూతురు అని తెలిసిందని సికింద్రాబాద్ న్యూబోయినపల్లి ఆర్యసమాజ్ నిర్వాహకులు వెంకటరమణ మూర్తి చెప్పారు. వైదిక సంప్రదాయం ప్రకారం వివాహం చేశానని పురోహితుడు లింగమాచారి అన్నారు. తాను 30 ఏళ్లుగా ఆర్య సమాజ్ వివాహాలు చేస్తున్నానని ఆయన చెప్పారు. ధర్మాంతర్గతంగా వివాహం చేశానని ఆయన చెప్పారు.
పెళ్లి కొడుకు భరద్వాజ్ చిరునామా కోసం రేషన్ కార్డు ఇచ్చారని, పెళ్లి కూతురు శ్రీజ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారని వెంకటరమణమూర్తి చెప్పారు. నలుగురు సాక్షులను తెచ్చుకోవాలని చెబుతామని, అలాగే తెచ్చారని ఆయన అన్నారు. టీవీ చానెల్ వచ్చిన తర్వాత గాని శ్రీజ చిరంజీవి కూతురని తెలియదని ఆయన అన్నారు. ఈ ఇద్దరితో ఒక ప్రైవేట్ టీవీ చానెల్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ చర్చా కార్యక్రమంలో వారు చాలా విషయాలు మాట్లాడారు. వయసు నిర్ధారణ కోసం శ్రీజ మద్రాసులో చదువుకున్న స్కూల్ సర్టిఫికెట్ ఆర్య సమాజ్ కు ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications