జర్నలిస్టును ఎత్తుకెళ్లిన ఏనుగులు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతంపేట అటవీ ప్రాంతంలో ఏనుగులు ఒక జర్నలిస్టును ఎత్తుకెళ్లాయి. ఏనుగుల దాడికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు నలుగురు జర్నలిస్టులు కొంతమంది గ్రామస్థులతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఏనుగులు వస్తున్న విషయాన్ని వారు గమనించలేదు. అకస్మాత్తుగా అవి దాడికి ప్రయత్నించాయి. దీంతో తలో దిక్కు పారిపోయారు. తీరా చూస్తే ఒక జర్నలిస్టు కనిపించలేదు.
ఆ జర్నలిస్టును ఏనుగులు ఎత్తుకుపోయినట్లు భావిస్తున్నారు. మాయమైన జర్నలిస్టు ఆంధ్రప్రభ వీరఘట్టం విలేకరి నాగరాజు అని తెలుస్తోంది. అతని సెల్ కు ఫోను చేస్తుంటే అది మోగుతోంది గానీ ఎవరూ ఎత్తడం లేదు. దీంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా సీతంపేట అటవీ ప్రాంతంలో ఏనుగులు ప్రజలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications