నిరాడంబరంగా భూమిక పెళ్లి
నాసిక్: ప్రముఖ సినీ నటి భూమిక పెళ్లి నిరాడంబరంగా జరిగింది. నాసిక్ లో ఆమె తన ప్రియుడు యోగా ఇన్ స్ట్రక్టర్ భరత్ ఠాకూర్ ను వివాహమాడింది. ఈ వివాహానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. లక్షాధికారి భరత్ ఠాకూర్ ను వివాహమాడిన తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించనుంది.
సుమంత్ తో కలిసి నటించిన యువకుడు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన భూమిక 11 తెలుగు సినిమాల్లో నటించింది. మూడు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. తొమ్మిది హిందీ సినిమాల్లో నటించి తన సత్తాను చాటుకుంది.












Click it and Unblock the Notifications