సైఫ్ తో కరీనా సుఖంగా ఉండాలి: షాహిద్
ముంబయి: సైఫ్ అలీఖాన్ తో కరీనా కపూర్ సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని షాహిద్ కపూర్ అంటున్నారు. కరీనా కపూర్ తో తన సంబంధం గురించి, ఆమెతో విడిపోవడం గురించి అతను వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడు. కరీనా కపూర్ జ్ఞాపకాలను తాను పదిలంగా దాచుకుంటానని అతను అంటున్నాడు. సైఫ్ అలీఖాన్ తో కరీనా కపూర్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతుండడం, తమ మధ్య సంబంధాన్ని సైఫ్ అలీఖాన్ ధ్రువీకరించడం వంటి పలు అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో షాహిద్ తన బాధను వెలిబుచ్చాడు.
షాహిద్ కపూర్, కరీనా కపూర్ కలిసి నటించిన జబ్ వి మెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే షాహిద్ కు, కరీనాకు మధ్య గత నాలుగు నెలలుగా విభేదాలు పొడసూపాయి. షాహిద్ విద్యా బాలన్ కు దగ్గరయ్యాడని అంటున్నారు. విద్యాబాలన్ తో సంబంధాలు పెరగడమే వీరిద్దరు విడిపోవడానికి కారణమని అంటున్నారు.












Click it and Unblock the Notifications