తెరాసకు క్రెడిట్ దక్కకూడదనే: గాదె వెంకటరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటును ఇప్పుడే అంచనా వేయలేమని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు గాదే వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును నేరుగా చేయకూడదనే రెండో ఎస్సార్సీ అంటున్నామని, నేరుగా తెలంగాణ ఏర్పాటుకు పూనుకుంటే ఆ క్రెడిట్ తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కుతుందని, అలా దక్కకూడదనేది తమ ఉద్దేశంమని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీకి నివేదిక ఇప్పించామని ఆయన చెప్పారు. రెండో ఎస్సార్సీ ద్వారా తెలంగాణ ఇస్తే ఆ ఖ్యాతి కాంగ్రెసుకు దక్కుతుందని ఆయన అన్నారు.
తెలంగాణపై రెండో ఎస్సార్సీని వేస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి నల్లగొండలో అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీని అంగీకరించబోమని, నేరుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని మరో సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications