గచ్చిబౌలిలోనే అమెరికా కాన్సులేట్ ఆఫీసు
హైదరాబాద్: హైదరాబాదులోని పైగా ప్యాలెస్ లో అమెరికా కాన్సులేట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు. గచ్చిబౌలిలో పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేసే వరకు తాత్కాలికంగా కాన్సులేట్ కార్యాలయాన్ని పైగా ప్యాలెస్ లో ఏర్పాటు చేయాలని మొదట తలపెట్టారు.
భద్రతా కారణాల రీత్యా పైగా ప్యాలెస్ లో కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీన్ని గచ్చిబౌలిలోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి ప్రభుత్వం గచ్చిబౌలిలో భూమిని కేటాయించింది.












Click it and Unblock the Notifications