వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్ దాడిలో మరాండీ కొడుకు సహా 17 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews


రాంచీ: జార్ఖండ్‌లో నక్షల్స్ మరో సారి హఠాత్తుగా దాడి జరపడంతో 17 మంది హతమవ్వగా, మరో నలుగురు గాయపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి. హతులైనవారిలో జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీ కుమారుడు అనూప్ కూడా ఉన్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. జార్ఖండ్‌లోని గిరిఢీ జిల్లా చిలఖాడియా గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, జన సమ్మర్థం ఉన్న ప్రాంతంలో సుమారు 25 నుంచి 30 మంది నక్షలైట్లు దాడి చేశారని ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారి అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు.

శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు నక్షలైట్లు దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు నిర్వహించారని ఆయన చెప్పారు. దీంతో ఈ దుర్ఘటనలో 14 మంది అక్కడికక్కడే మరణించగా, మిగిలిన ముగ్గురు చికిత్స చేస్తుండగా చనిపోయారని తెలిపారు. మరాండీ సోదరుడిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ దాడి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X