5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళే .. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం..
ఉత్కంఠంగా మారిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కానుంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 823 అసెంబ్లీ స్థానాల భవితవ్యాన్ని తేల్చే ఈ లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
తమిళనాడులో స్టాలిన్ మళ్లీ గెలుస్తారా..? విజయం సంచలనం సృష్టిస్తారా..? అలాగే బెంగాల్ లో మమతా బెనర్జీకి బీజేపీ చెక్ పెట్టనుందా..? దీదీ మరోసారి సీఎం అవుతారా..? అనే దానిపై దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ను కాదని.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు అధికారం దక్కే అవకాశం ఉందని పోల్స్ చెబుతున్నాయి. అలాగే అసోంలో హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సమాచారం. ఇక పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమికే విజయావకాశాలున్నాయని అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే.

ఇక తమిళనాడులో 62 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆ తర్వాత 8:30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. బెంగాల్ లో ఇవాళ 77 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications