వైయస్ అవినీతి వల్లే ఈ దుస్థితి: చంద్రబాబు
నిజామాబాద్: తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కలెక్టర్లను తప్పు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. గల్ఫ్ బాధితుల సభలో పాల్గొనడానికి వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మూడేళ్ల పాటు ప్రజాసమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. అధికార యంత్రాంగం పనిచేయకపోవడానికి ముఖ్యమంత్రి ప్రవర్తనే కారణమని ఆయన అన్నారు. వరదల తాకిడికి గురైన నాలుగు జిల్లాల ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, సహాయక చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications