పేలిన మందుపాతర: ఇద్దరు పోలీసులకు గాయాలు
విశాఖపట్నం: విశాఖపట్నం పెదబయలు మండలం గుండ్రంగి గ్రామ సమీపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అయితే పోలీసులు పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఈ పేలుడులో ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని అస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
విశాఖపట్నం జిల్లాలో కొద్ది వ్యవధిలో మావోయిస్టుల మందుపాతర పేలడం పోలీసులను ఆందోళనకు గురి చేస్తోంది. విశాఖపట్నం జిల్లా జి.కె. వీధి మండలంలో మంగళవారం సాయంత్రం మందుపాతర పేలింది. ఈ మందుపాతర పేలుళ్లతో పోలీసులు మరింత అప్రమత్తం అవుతున్నారు.












Click it and Unblock the Notifications