ముఖ్యమంత్రిని కలిసిన కొత్త డిజిపి
హైదరాబాద్: రాష్ట్ర కొత్త పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) శ్యాంసుందర్ ప్రసాద్ యాదవ్ బుధవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. డిజిపిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎం.ఎ. బాసిత్ స్థానంలో ఆయన డిజిపిగా నియమితులయ్యారు. బాసిత్ కు బుధవారంనాడే వీడ్కోలు చెప్పారు.
బాసిత్ నుంచి శ్యాంసుందర్ ప్రసాద్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు యాదవ్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. హోంశాఖ కార్యదర్శి పి.వి. నాయుడును డిజిపిగా నియమించనున్నట్లు అంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే డిజిపిగా యాదవ్ ను నియమిస్తూ అనూహ్యంగా బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు వెలువడ్డాయి.












Click it and Unblock the Notifications