నలుగురు బాలికల కిడ్నాప్: తప్పించుకున్న ఇద్దరు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలంలో నలుగురు బాలికలు కిడ్నాప్ అయ్యారు. వారిలో ఇద్దరు కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకుని వచ్చారు. వీరి కిడ్నాప్ మంగళవారం సాయంత్రమే జరిగినప్పటికీ ఈ వ్యవహారమంతా బుధవారంనాడు బయటపడింది. తప్పించుకుని వచ్చిన బాలికల్లో ఒకామె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
బుధవారం సాయంత్రం వేర్వేరు ప్రాంతాల్లోంచి నలుగురు బాలికలను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక బాలిక గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిందని భావిస్తున్నారు. బాలికలు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. తమను కారులో తీసుకుని వెళ్లారని కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న బాలిక చెప్పింది. మిగతా అమ్మాయిలెవరో తనకు తెలియదని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications