అనుమానంతో భార్య కాళ్లు నరికిన భర్త
ఆదిలాబాద్: ఒక అనుమానపు భర్త భార్య రెండు కాళ్లు నరికిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగరులో జరిగింది. భర్త చేతిలో కాళ్లు కోల్పోయిన ఫాతిమా అనే మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించే ప్రయత్నం జరుగుతోంది. భర్త తనను అనుమానంతో విపరీతంగా వేధించేవాడని, చివరికి ఇలా చేశాడని ఆమె అవేదన చెందుతోంది.
తనను ఒక్కసారిగా చంపేయాలని వేడుకున్నానని, అయినా ఇలా చేశాడని ఆమె అంటోంది. తన బిడ్డ పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆమె భర్త అకృత్యానికి బలి పశువుగా మారింది. నవంబర్ ఒకటవ తేదీన తన బిడ్డ పుట్టిన రోజు అని ఆమె చెప్పుకుంది.












Click it and Unblock the Notifications