ఆటో సమ్మెకు కార్మిక సంఘాల మద్దతు
హైదరాబాద్: ఆటో సమ్మెకు అఖిల పక్ష కార్మిక సంఘాలు బుధవారం మద్దతు ప్రకటించాయి. ఆటో సమ్మెకు మద్దతుగా గురువారం హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద రాస్తా రోకో నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆటో సంఘాలు బుధవారం అఖిల పక్ష కార్మిక సంఘాల ప్రతినిధులతో బుధవారం రౌండ్ టేబులు సమావేశం నిర్వహించాయి.
ఆటో సమ్మెపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని సంఘాలు కోరాయి. ఆటో సమ్మె విషయంలో రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ మొండివైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించాయి. డిజిటల్ మీటర్లను కూడా ట్యాంపర్ చేయడానికి వీలుందని తాము కన్నా లక్ష్మీనారాయణకు చూపించి నిరూపిస్తామని ఆటో సంఘాలు అంటున్నాయి.
ఆటో సంఘాల నాయకులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో రోజు బుధవారంనాడు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఆటోల సమ్మె కొనసాగింది. దాదాపు లక్ష ఆటోలు సమ్మెలో పాల్గొన్నాయి.












Click it and Unblock the Notifications