ఇంటిదారి తప్పదు: కలెక్టర్లకు వైయస్ హెచ్చరిక
హైదరాబాద్: పద్ధతి మార్చుకోకపోతే ఇంటిదారి పట్టక తప్పదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లా కలెక్టర్లను హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ల, ఎస్పీల సమావేశం బుధవారంనాడు ముగిసింది. గత ప్రభుత్వంలో లాగా కాకి లెక్కలతో మురిసిపోయే ముఖ్యమంత్రిని కానని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముదిగొండ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఎస్పీలకు సూచించారు. ప్రతిపక్షాల భూపోరాటాల పట్ల సంయమనం పాటించాలని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధుల పట్ల కాస్తా గౌరవంగా మెలగాలని ఆయన మెత్తగా చురక అంటించారు.












Click it and Unblock the Notifications