విశాఖలో సినీ తారల క్రికెట్ పండుగ
విశాఖపట్నం: సినీతారలు, క్రికెటర్లతో విశాఖపట్నం సందడిగా మారింది. వెల్పేర్ టాలీవుడ్ క్రికెట్ ట్రోఫి ట్వంటీ 20 మ్యాచులో ఆడేందుకు తెలుగు తారలు, క్రికెటర్లు ఫోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచును చూసేందుకు ప్రజలు పెద్దయెత్తున వచ్చారు. సినీ నటులు శ్రీకాంత్, తరుణ్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రఘు తదితరులు మొత్తం 30 మంది వచ్చారు. బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ అంబటి తిరుపతిరాయుడు, క్రికెటర్ అజరుద్దీన్ తనయుడు అబ్బాసుద్దీన్ కూడా దీనికి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాలీవుడ్ సహకారంతో అరకులో క్రీడా సముదాయం నిర్మాణం కోసం ఈ మ్యాచు ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. గిరిజన యువత క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ ట్రోఫీ ముఖ్య ఉద్దేశం. తరుణ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఒక మంచి లక్ష్యం కోసం పని చేయడం ఆనందంగా ఉందని తారలు, క్రీడాకారులు అంటున్నారు












Click it and Unblock the Notifications