ఆవేశంతోనే కల్పనపై యాసిడ్ దాడి: దామోదర్
శ్రీకాకుళం: ప్రేమించలేదనే కోపంతో కల్పన అనే డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన దామోదర్ అనే ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడిని పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. తనకు కాకుండా పోతుందనే ఆవేశంతో మాత్రమే తాను కల్పనపై దాడి చేశానని దామోదర్ మీడియా ప్రతినిధులతో అన్నాడు. తానను, కల్పనను ఆమె తల్లిదండ్రులు విడదీయాలనుకుంటున్నారని అతను చెప్పుకున్నాడు. తాను కల్పనతో పెళ్లి విషయం మాట్లాడుతుండగా ఆవేశంతో దాడి చేశానని అతను అన్నాడు.
కల్పన తాను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తామిద్దరం కలిసి తీయించుకున్న ఫొటోలు కల్పన కాదని, నిజంగానే తాము కలిసి ఫొటోలు దిగామని అతను చెప్పాడు. ఇప్పటికీ తాను కల్పనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కల్పన లేకుండా తాను బతకలేనని అతను అన్నాడు. దామోదర్ ను పోలీసులు అరెస్టు చేసి పలాసకు తీసికెళ్లారు. అనంతరం అతన్ని ఇచ్చాపురం కోర్టులో ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications