ప్రజల ఆనందంతోనే జీవితం ధన్యం: వైయస్
నిజామాబాద్: ఎన్నికలకు ముందు తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అవి అమలు జరిగినప్పుడు ప్రజల కళ్లలో తాను ఎనలేని ఆనందాన్ని చూస్తున్నానని, తనకు అంతకన్నా కావాల్సిందేమీ లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని జానకంపేట వద్ద నిర్మించిన అలీసాగర్ ప్రాజెక్టును ఆయన ఆదివారంనాడు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎంత వ్యయానికైనా ఓర్చి తాము సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు.
రైతులను, పేదలను అన్ని విధాలా తాము ఆదుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మారుస్తామని ఆయన చెప్పారు. 1999లో అలీసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. 260 కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానినికి మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఆర్. దామోదర్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications