చిరంజీవి పార్టీ పెడితే మంచిదే:గాదే వెంకటరెడ్డి
హైదరాబాద్-చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయ పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీపై ప్రభావం ఉంటుందని ఇపుడే ఎలా చెబుతామని ఆయన అన్నాడు. చిరంజీవి రాజకీయ పార్టీ ప్రకటన వెలువడిన తరువాత ఎన్ని కోణాల్లో విశ్లేషణ చేయాల్సిఉంటుందన్నాడు. చిరంజీవి కుల, వర్గ, సామాజిక అంశాలపై తీసుకునే నిర్ణయాలపైనే మిగతా రాజకీయ పార్టీలపై ప్రభావం పడుతుందా లేదా అనేది తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత మూడేళ్ల నుంచి చిరంజీవి రాజకీయాలలోకి వస్తాడు..వస్తాడు..వస్తాడు అంటూ పత్రికలు, చానెళ్లు ప్రచారం చేస్తున్నాయి తప్ప చిరంజీవి నుంచి అసలు స్పందనేలేదని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే తన రాజకీయ రంగ ప్రవేశంపై చిరంజీవి ఎలాంటి ప్రకటన చేయకముందే దానిపై ఎలా స్పందిస్తామని సిపిఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవి పార్టీని ప్రకటిస్తే ఇంతకుముందు చెప్పినట్టుగానే మూడో ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుతామని ఆయన అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు లాభం చేకూర్చే ప్రతిపాదనలతో పార్టీ పెడితే తప్పక ఆయనతో కలుస్తామని సుధాకర్ రెడ్డి అన్నారు. వీటన్నిటికన్నా ముందు చిరంజీవి ప్రకటన చేయాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications