విశాఖ సెంట్రల్ జైలుకు ఎమ్మెల్యే చెంగల
విశాఖపట్నం: తెలుగుదేశం శాసనసభ్యుడు చెంగల వెంకట్రావును పోలీసులు విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. బంగారయ్యపేట హత్య కేసులో వెంకట్రావు సోమవారం గిద్దలూరు కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.
చెంగల వెంకట్రావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషనును కోర్టు తిరస్కరించింది. బంగారయ్యపేటలో ఘర్షణ జరిగి ఒకరు హత్యకు గురికావడానికి చెంగల వెంకట్రావు కారణమని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications