పరీక్ష హాల్లో తాళి: తెంచేసిన యువతి
అనంతపురం: అనంతపురంలో ఒక యువకుడు పరీక్షా హాల్లోనే ఒక యువతి మెడలో తాళి కట్టిన సంఘటన సోమవారం జరిగింది. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో బి.ఇడి. పరీక్ష రాస్తున్న రాజేశ్వరి అనే యువతి మెడలో కడపలో ఎంబిఎ చదువుతున్న వెంకటరమణ అనే యువకుడు పరీక్ష హాల్లో తాళి కట్టాడు. దీనికి నివ్వెరపోయిన రాజేశ్వరి తాళి తెంచేసి పరీక్ష రాసింది. ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు.
తాము నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, రాజేశ్వరి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడం లేదని, దాంతో తాను ఇలా తాళి కట్టాల్సి వచ్చిందని వెంకటరమణ అన్నాడు. అలా తాళి కట్టడం తప్పేనని, అయితే తాను రాజేశ్వరి లేకుండా జీవించలేనని చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications