విద్యుదుత్పత్తికి చేసిందేమీ లేదు: బాబు
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుతు కోసం ప్రభుత్వం చేసిందేమీ లేదని, నాలుగేళ్లలో ఒక యూనిట్ విద్యుత్తును కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. మెదక్ జిల్లాలోని పటాన్ చెరు మండలం బొంతపల్లి నుంచి జరిగే ఆయన శుక్రవారం ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లే ముందు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని ఆయన మరోసారి హామీ ఇచ్చారు.
రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన విమర్శించారు. వ్యవసాయ నిపుణులతో చర్చించి యుఎన్ పిఎ భవిష్యత్తు కార్యక్రమాన్ని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 18వ తేదీన రైతుల సమస్యలపై వ్యవసాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం బొంతపల్లి నుంచి ఆయన రోడ్ షో నిర్వహించారు.












Click it and Unblock the Notifications