పిండం చనిపోయి జకీరా మృతి: వైద్యులు
హైదరాబాద్: పిండం చనిపోవడం వల్ల రిమాండ్ ఖైదీ జకీరా బేగం మరణించిందని నయాపూల్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. చంచల్ గుడా జైలులో అక్టోబర్ 25వ తేదీన ఒక హత్య కేసులో జకీరా రిమాండ్ ఖైదీగా ఉంటోంది. తమకు రక్షణ కల్పించే వరకు ఆందోళనను విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఒక వర్గం వారి విషయంలో ప్రభుత్వం తమను పావులుగా వాడుకుంటోందని వారు విమర్శిస్తున్నారు.
తాము పేదలకు సేవ చేస్తున్నామని, అటువంటి తమపై దాడులు జరుగుతున్నాయని, ఆరోగ్య మంత్రి గల్లా అరుణకుమారి తమకు ఎన్ని హామీలు ఇచ్చినా ఫలితం లేదని వారంటున్నారు. ఘటనకు సంబంధించి బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అయితే ఎవరి మాటలను జూనియర్ డాక్టర్లు వినడం లేదు. తాము డిగ్రీలను వదులుకోవడానికైనా సిద్ధమని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications