రైలును ఢీకొన్న బస్సు: 17 మంది మృతి
లూథియానా: పంజాబ్ లోని మోగా జిల్లా నూచుర్ చాక్ గ్రామం శుక్రవారం ఉదయం వద్ద ప్యాసెంజర్ రైలు మినీ బస్సును ఢీకొట్టడంతో 17 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద మినీ బస్సును సట్లెజ్ ఎక్సుప్రెస్ ఢీకొట్టింది. మినీ బస్సులో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు విద్యార్థులున్నట్లు సమాచారం. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు. రైలు వస్తుండగా గేటు వేసి ఉందని, బస్సు గేటును గుద్దుకొని రైలును ఢీకొట్టిందని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ శ్రీప్రకాశ్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30-35 మంది ఉన్నారని స్థానిక పోలీసు అధికారి జస్బీర్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications