అబూ సలేంకు జనవరి 3వరకు రిమాండ్
హైదరాబాద్: నకిలీ పాసుపోర్టుల కేసులో అండర్ వరల్డ్ డాన్, సినీనటి మోనికా బేడీ ప్రియుడు అబూ సలేంను సిబిఐ అధికారులు గురువారంనాడు నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అతనికి వచ్చే నెల 3వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టాడా కేసులో అతన్ని తిరిగి ముంబైకి తరలించే అవకాశాలున్నాయి. సలేంను ముంబై నుంచి బుధవారంనాడు హైదరాబాదుకు తరలించారు.
బుధవారంనాడు తన ముందు హాజరుపరిచిన అబూ సలేంను గురువారం ఉదయం పదిన్నర గంటలకు తిరిగి ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో అయనను సిబిఐ అధికారులు గురువారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టారు. కర్నూలు జిల్లా నుంచి తాను, తన భార్య సమీర,ప్రియురాలు మోనికా బేడీలో కోసం నకిలీ పాసుపోర్టులు తీసుకున్న కేసు అబూ సలేంపై ఉంది.












Click it and Unblock the Notifications