జడ్పీ చైర్మన్ రాథోడ్ కు జైలు శిక్ష
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రమేష్ రాథోడ్ కు లక్సెట్టిపేట మున్సిఫ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, 8 వేల రూపాయల జరిమానా విధించింది. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ కొండలరావుపై చేయి చేసుకున్నట్లు మోపిన అభియోగాలు రుజుపు కావడంతో కోర్టు ఆయనకు గురువారం శిక్ష ఖరారు చేసింది. పేదల గుడిసెలు తొలగిస్తున్న సమయంలో జరిగిన గొడవలో రాథోడ్ కొండలరావుపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
మున్సిఫ్ కోర్టు తీర్పును తాను హైకోర్టులో సవాల్ చేస్తానని రమేష్ రాథోడ్ చెప్పారు. కోర్టు తనకు విధించిన 8 వేల రూపాయల జరిమానాను ఆయన చెల్లించారు. ఇద్దరి పూచీకత్తుపై కోర్టు రాథోడ్ కు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications